దబంగ్-2 నుండి తప్పుకున్న సెంథిల్ కుమార్

దబంగ్-2 నుండి తప్పుకున్న సెంథిల్ కుమార్

Published on Mar 19, 2012 7:24 PM IST

ప్రముఖ చాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ దబాంగ్-2 చిత్రం చెయ్యట్లేదు. కొద్ది వారాల క్రితం మేము ప్రచురించిన కథనం ప్రకారం సెంథిల్ దబాంగ్-2 చిత్రం తో బాలివుడ్ లో ఆరంగేట్రం చెయ్యబోతున్నారు అని చెప్పాము. “మగధీర” మరియు “అరుంధతి” వంటి చిత్రాలలో పని తనం చూసి దబాంగ్ -2 చిత్ర దర్శకుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ ని ఎంపిక చేసుకున్నారు. మూడు రోజుల చిత్రీకరణ జరిగిన తరువాత సల్మాన్ ఖాన్ మరియు సెంథిల్ రెండు విభిన్న రకాలుగా ఆలోచించడం మరియు సల్మాన్ ఖాన్ కి సెంథిల్ పనిలో వేగం నచ్చకపోవటంతో ఈ చిత్రం నుండి సెంథిల్ తప్పుకున్నారు “ఏక్ థా టైగర్” చిత్రానికి చాయాగ్రహణం అందిస్తున్న అజీం కుమార్ ఈ స్థానాన్ని భర్తీ చేశారు.

తాజా వార్తలు