తన రాబోయే త్రిభాషా చిత్ర చిత్రీకరణ లో పాల్గొనటానికి సమంత లండన్ పయనమవ్వనుంది. తెలుగు లో “ఎటో వెళ్లిపోయింది మనసు” అనే పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో నాని మరియు సమంతలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజుతో నందిని రెడ్డి చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమంత ఈ రాత్రికే లండన్ పయనమవుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పరిచింది. ఇళయరాజా సంగీతం అందిస్తుండటం ఈ అంచనాలను మరింత పెంచాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది. ఈ చిత్రం కాకుండా సమంత “ఎవడు”,”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”,”ఆటోనగర్ సూర్య” మరియు మణిరత్నం “కడల్” చిత్రాలలో నటిస్తుంది.