కొద్దిరోజుల క్రితం మేము ప్రచురించిన కథనం ప్రకారం మార్చ్ 23న ఉగాదికి మొదలు కాబోతున్న అనిల్ సుంకర 3డి చిత్రం ప్రారంభానికి రవితేజ ముఖ్య అతిధిగా రాబోతున్నారు అని చెప్పాము. కాని తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు తమిళనాడు గవర్నర్ శ్రీ రోశయ్య గారు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. రవితేజ ఈ వేడుకలో పాల్గొనటం లేదు .ద్విభాషా చిత్రమయిన ఈ చిత్రం తెలుగు చిత్రానికి కోదండరామి రెడ్డి క్లాప్ కోట్టబోతుండగా ఏ.యం.రత్నం గౌరవ దర్శకత్వం వహించబోతున్నారు . తమిళ చిత్రానికి తమిళ స్టార్ శింభు క్లాప్ కొడుతుండగా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి గౌరవ దర్శకత్వం వహించబోతున్నారు. అల్లరి నరేష్, వైభవ్, కిక్ శ్యాం, రాజు సుందరం, స్నేహ ఉల్లాల్, విమల రామన్, కామ్న జేత్మలని, నీలం మరియు ఇద్దరు కథానాయికలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ సుమారుగా పదిహేను కోట్లు ఉండబోతుంది అని చెప్పారు.