బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న రెబల్

బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న రెబల్

Published on Jan 1, 2012 6:01 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ లారెన్స్ డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రెబల్’. ప్రస్తుతం బ్యాంకాక్ వెళ్ళిన ఈ చిత్ర యూనిట్ డిసెంబరు 21 నుండి జనవరి 12 వరకు అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు ప్రభాస్ తండ్రిగా నటిస్తున్నారు. ప్రభాస్ కి జోడీగా తమన్నా మరియు దీక్షా సేథ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. జె. భగవాన్ మరియు జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు