2011 లో “దం మారో దం” చిత్రానికి గాను రానా కు అత్యంత ప్రాచుర్యం పొందిన నూతన నటుడు” గా ఎంపికయ్యారు. ప్రముఖ జాతీయ దిన పత్రిక నిర్వహించిన సర్వేలో ఈ నటుడు ఈ ఘనతను సాదించారు. రెండు లక్షల మందికి పైగా పాల్గొన్న ఈ పోటిలో వారి వారి ఇష్టమయిన నటులకు వోట్ చేశారు. విద్యుత్ జమ్వాల్, సెంధిల్ రామమూర్తి మరియు శివ పండిట్ వంటి నటులు ఈ పోటిలో ఉన్నారు. వీరందిరిని ఓడించి రానా విజేతగా నిలిచారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో “డిపార్టుమెంటు” చిత్రంలో నటిస్తున్నారు దీని వెంటనే మరో చిత్రం. ఇవి కాకుండా హాలివుడ్ లో “మొమెంటరి అఫ్ లాప్సే” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన “నా ఇష్టం” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాదించడంతో ఆయన ఆనందానికి హద్దులు ఉండవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.