రాత్రిల్లో చిత్రీకరణలో పాల్గొంటున్న రానా

టాలివుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి తన రాబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” కోసం రాత్రిల్లో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. నానక్రాంగూడ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ మధ్యనే ఈ చిత్ర బృందం వేసవి ఎండలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించింది దాంతో ఈ రాత్రి సన్నివేశాల చిత్రీకరణ, బృందం మొత్తానికి ఊరటనిస్తుంది.రానా సరసన నయనతార నటిస్తుండగా ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. జాగర్ల మూడి సాయి బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version