బిగ్ బి ఆశీర్వాదం తీసుకున్న చరణ్

రామ్ చరణ్ బాలివుడ్ ప్రవేశం “జంజీర్” చిత్రం కోసం అన్ని సిద్దమయ్యాయి. రెండు రోజుల క్రితమే చిత్రీకరణ మొదలయినా ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకునేముందు చరణ్ ఒక పని చేయ్యలనుకున్నారు. ఈరోజు చరణ్ అమితాబ్ బచ్చన్ ని కలిశారు పాత జంజీర్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కథానాయకుడు. అమితాబ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న చరణ్ వారిరువురు ఉన్న ఫోటోని ట్విట్టర్ లో ఉంచారు.” ఇప్పుడే అమితాబ్ బచ్చన్ గారిని కలిసాను ఇప్పుడే జంజీర్ మొదలయ్యింది ” అని చరణ్ అన్నారు.. ఈ చిత్రం మొదలయినప్పటి నుండి చరణ్ కాస్త ఇబ్బందిగానే ఉన్నాడు 70లలో జంజీర్ భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే సినిమాగా వచ్చింది. అటువంటి చిత్రాన్ని రిమేక్ చెయ్యడమేంటి అని అందరు అడిగారు. ఈ విషయమై చరణ్ కాస్త భయపడ్డారు అందుకే అమితాబ్ బచ్చన్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తుంది. అపూర్వ లాఖియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు.

Exit mobile version