రామ్ చరణ్ ఈ నెల చాలా బిజీ గా గడుపబోతున్నారు. జనవరి 5 నుండి రచ్చ షూటింగ్ లో పాల్గొనబోతున్న రామ్ చరణ్ అది అయిపోయిన వెంటనే ఈ నెల చివర్లో వి.వి.వినాయక్ చిత్రం మరియు వంశీ పైడిపల్లి చేస్తున్న “ఎవడు” చిత్రాల చిత్రీకరణ లో ను పాల్గొనబోతున్నారు. ఈ చిత్రం లో చరణ్ సమంత సరసన చేస్తుండగా అల్లు అర్జున్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. “మగధీర” తరువాత చరణ్ కాజల్ తో కలిసి వి.వి.వినాయక చిత్రం లో నటిస్తున్నారు. గతంలో చెప్పినట్లుగానే చరణ్ సంవత్సరానికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తున్నటు కనిపిస్తున్నారు మెగా అభిమానులకి మాత్రం ఈ సంవత్సరం విడుదల కానున్న మూడు చిత్రాలతో కన్నులపండుగే.