సంక్రాంతికి లింక్ లేదా? క్రేజీ థాట్ తో వెంకీమామ రోల్?

ManaShankaraVaraPrasadGaru-sankranthiki vasthunam

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో వెంకీ మామ కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తన రోల్ విషయంలో ఇది వరకు కొన్ని రూమర్స్ ఉన్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం తో లింక్ ఉండొచ్చు అని కూడా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అందులో నిజం లేదని వినిపిస్తోంది. అయితే దానికి మించిన క్రేజీ ఆలోచన కామెడీ సీన్స్ తో అనీల్ రావిపూడి వస్తున్నట్టు టాక్. వెంకీమామ వింటేజ్ సినిమాల్లో ఒక ఐకానిక్ రోల్ ని తీసుకున్నారట. దానికి నయన్ రోల్ కి లింక్ ఉంటుంది అని వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.

Exit mobile version