ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో ‘డ్రాగన్’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా త్వరలో విదేశాల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకునేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా లొకేషన్ల రెక్కీ కోసం ప్రశాంత్ నీల్ తన సాంకేతిక బృందంతో పాటు ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియాకి వెళ్ళాడు. ఈ వారమంతా నీల్ అక్కడే గడపనున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబరు చివరి వారంలో అక్కడే ఓ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తారట.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, యాక్షన్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో సాగుతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ కోసమే ఎన్టీఆర్ కఠిన కసరత్తులు చేసి సన్నని లుక్‌లోకి మారారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతమందిస్తుండగా.. టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తోంది.
