వి వి వినాయక్ చిత్రం కోసం దుబాయ్ వెళ్ళిన రామ్ చరణ్

వి వి వినాయక్ చిత్రం కోసం దుబాయ్ వెళ్ళిన రామ్ చరణ్

Published on May 20, 2012 8:53 PM IST

వివి వినాయక దర్శకత్వంలో రామ్ చరణ్ రాబోతున్న చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అక్కడ ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ పాట చిత్రీకరణ తరువాత చిత్ర బృందం ఐరోపాలో కొన్ని సన్నివేశాలను మరియు పాటలను చిత్రీకరించడానికి వెళ్తుంది. కాజల్ మరియు అమలా పాల్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని వారాలుగా రామ్ చరణ్ వి వి వినాయక చిత్రం, వంశీ పైడిపల్లి “ఎవడు” మరియు బాలివుడ్ “జంజీర్” చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ జూన్ 14న ఉపాసనతో పెళ్లి అయ్యాక చరణ్ చాలా రోజులు పాటు విరామం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు