ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టిన రామ్ చరణ్

ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టిన రామ్ చరణ్

Published on Mar 18, 2012 10:49 AM IST

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ చిత్ర ముహూర్తం ఈ రోజు (మార్చి 18) న ఉదయం రామానాయుడు స్టుడియోలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ హాజరయ్యాడు. ఈ చిత్ర ముహూర్త షాట్ లో ఎన్టీఆర్ పాల్గొనగా రామ్ చరణ్ క్లాప్ కొట్టాడు. ఈ వేడుకకి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఒకే కారులో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇద్దరు కలిసి రావడం వారి అభిమానులని కూడా ఆశ్చర్యపరిచింది. వీరితో పాటుగా రామానాయుడు గారు, వెంకటేష్, రాజమౌళి, వంశీ పైడిపల్లి, తమన్, కోన వెంకట్, గోపి మోహన్, స్రవంతి రవి కిషోర్,బోయపాటి శ్రీను, దిల్ రాజు, వల్లభ ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల నిర్మాత బండ్ల గణేష్ బాబు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ సరసన కాజల్ నటిస్తున్న ఈ చిత్రంలో అధిక విదేశాలలో చిత్రీకరించనున్నారు.

బాద్షా సినిమా ఓపెనింగ్ ఫొటోస్

తాజా వార్తలు