రామ్-బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం రేపు ప్రారంభం

యూత్ ఫుల్ హీరో రామ్ తరువాతి చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ తో చేయ్యబోతున్నారు ఈ చిత్రానికి బివిఎసేన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రేపు ఈ చిత్రపు ముహూర్తపు సన్నివేశాన్ని బి వి ఎస్ ఎం ప్రసాద్ ఆఫీసు లో చిత్రీకరించబోతున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ ఏప్రిల్ నుండి మొదలు కాబోతుంది. ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది కథానాయిక విషయాన్నీ త్వరలో ప్రకటిస్తారు రామ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న “ఎందుకంటే ప్రేమంట” చిత్రం లో నటిస్తున్నారు.

Exit mobile version