ప్రత్యేకం : రాజమౌళి ‘ఈగ’ ఆడియో తేది ఖరార్

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న భారీ గ్రాఫిక్స్ చిత్రం ‘ఈగ’ గురించి మీకోసం ఒక ప్రత్యేకమైన సమాచారం మేము సేకరించాము. ఈ చిత్రం ఆడియో ని హైదరాబాద్ లో మార్చ్ 6 వ తేదీన కానీ, 9 వ తారీకున కానీ విడుదల చేస్తారు. ఆడియో విడుదలకు కావలసిన ప్రదేశం అందుబాటులో ఉండే దాని బట్టి ఈ రెండు రోజులలో ఒక రోజు ఖరారు చేయబడుతుంది.

ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మన చలన చిత్ర సీమ లో ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రం లో ఎక్కువ గా ఉంటాయి. సమంతా కథానాయిక కాగా, నాని మరియు సుదీప్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని కీరవాణి అందించారు.

Exit mobile version