ఈగ కోసం విపరీతంగా కష్టపడుతున్న రాజమౌళి

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న గ్రాఫికాల్ బొనంజా ‘ఈగ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిహ్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో అందించేందుకు ఈగ టీం చాలా కష్ట పడుతుందని రాజమౌళి అంటున్నాడు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజమౌళి ఈ సినిమా కోసం చాలా గంటలు పోస్ట్ ప్రొడక్షన్ కోసం కష్టపడుతున్నట్లు సమాచారం. ఎమ్ ఎమ్ కీరవాణి కూడా ప్రస్తుతం ఈ చిత్రానికి రీ రికార్డింగ్ అందించే పనిలో ఉన్నారు. నాని మరియు సమంతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సుదీప్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈగ తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా ఒకేసారి విడుదల కానుంది.

Exit mobile version