కృష్ణ జిల్లాలో కలెక్షన్స్ అదరగొడుతున్న రచ్చ

కృష్ణ జిల్లాలో కలెక్షన్స్ అదరగొడుతున్న రచ్చ

Published on Apr 25, 2012 8:24 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రం ఏప్రిల్ 5న విడుదలై నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం కృష్ణ జిల్లాలో కలెక్షన్లతో అధరగోడుతుంది. నిన్నటి వరకు ఈ చిత్రం కృష్ణ జిల్లాలో 2 కోట్ల 27 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ ఏరియాలో ఇది అత్యదిక మొత్తం అని చెప్పుకోవాలి. భారీ స్థాయిలో విడుదల కావడం సెలవుల సీజన్ కూడా కలిసి రావడంతో ఈ చిత్రం భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. బెట్టింగ్ రాజ్ పాత్రలో రామ్ చరణ్ యాక్షన్, మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా అందాలు కూడా తోడవడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మ రధం పట్టారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి ప్రసాద్ మరియు పారస్ జైన నిర్మించారు.

తాజా వార్తలు