ఏప్రిల్ 6న తమిళ మరియు మలయాళం లో “రచ్చ”

ఏప్రిల్ 6న తమిళ మరియు మలయాళం లో “రచ్చ”

Published on Apr 4, 2012 3:42 AM IST

రామ్ చరణ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “రచ్చ”. ఈ చిత్రం తమిళ మరియు మలయాళంలో అనువాదం అవుతున్న విషయం విదితమే తమిళంలో “రగలై” మరియు మలయాళం లో “రక్షా” పేర్లతో విడుదలవుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదల కానుంది. గతంలో ఈ రెండు భాషలలో ను మగధీర చిత్రం రెండు సంవత్సరాలు ఆలస్యంగా విడుదలయ్యింది. “రచ్చ” చిత్రం మాత్రం తెలుగుతో పాటు ఒకేసారి ఈ రెండు భాషలలో విడుదలల కానున్నాయి. కర్నాటకలో ఈ చిత్రం తెలుగు వెర్షన్ భారీగా విడుదల కానుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ గిల్, అజ్మల్ , పార్తిబన్ మరియు ముఖేష్ రుషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 5న విడుదల కానుంది.

తాజా వార్తలు