మొదటి రోజు వసూళ్ళలో రచ్చ చేసిన “రచ్చ”

మొదటి రోజు వసూళ్ళలో రచ్చ చేసిన “రచ్చ”

Published on Apr 6, 2012 7:22 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి రోజు కల్లెక్షన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ “రచ్చ” చిత్రంతో నూతన రికార్డ్ సృష్టించారు. ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 8.04 కోట్లను వసూలు చేసింది. వేసవి కాలంలో భారీగా విడుదల చెయ్యటంతో ఈ చిత్రం ఈ ఘనతను సాదించడానికి సహకరించింది.తెలుగు పరిశ్రమ తాజాగా అవలంభిస్తున్న విధానం అత్యధిక థియేటర్లలో విడుదల చేసి అత్యధిక వసూళ్లు రాబట్టడాన్నే రచ్చ చిత్రం కూడా అవలంభించింది. “లాంగ్ రన్” విధానం ఎప్పుడో ముగిసిపోయింది. తక్కువ కాలం లో ఎక్కువ వసూళ్లు రాబట్టడానికే ప్రయత్నిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.

తాజా వార్తలు