బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్న ‘రచ్చ’

బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్న ‘రచ్చ’

Published on Apr 5, 2012 2:06 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రచ్చ చిత్రం ఈ రోజే విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సంచలనం సృష్టిస్తూ అధ్బుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకుంటూ ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకుంది. అన్ని ఏరియాల్లో ప్రేక్షకులు ఈ చిత్రానికి క్యూ కడుతున్నారని సమాచారం. ఈస్ట్ గోదావరిలో 39 సెంటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయగా అన్ని ఎరియాల్లోను భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఈ వేసవి సెలవుల్లో పెద్ద సినిమాలు కూడా విడుదలకు సమయం ఉండటంతో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. రచ్చ సినిమాని సంపత్ నంది దర్శకత్వం వహించగా రామ్ చరణ్ సరసన తమన్నా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు