రచ్చ ఆడియో విడుదల తేదీ ఖరారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ ఆడియో ఈ మార్చి నెల 11న విడుదల కానుంది. ఈ ఆడియో వేడుక హైదరాబాదులోని గచ్చిబౌలి మైదానంలో ఘనంగా చేయనున్నారు. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ పాత్రలో కనిపించబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మని శర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోలో ‘వాన వాన వెల్లువాయే’ పాట రీమిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రచ్చ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.

Exit mobile version