లవ్లీ ని అభినందించిన పూరి

లవ్లీ ని అభినందించిన పూరి

Published on Mar 15, 2012 11:49 PM IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో ఆది నటించిన చిత్రం “లవ్లీ” పాటలను ప్రశంశించారు. “లవ్లీ” చిత్ర ప్రొడక్షన్ ఆఫీసు కి వెళ్ళిన పూరి జగన్నాథ్ కోసం ప్రత్యేకంగా ఆ చిత్ర పాటలను ప్రదర్శించారు. పాటలు చూసిన పూరి చిత్ర బృందాన్ని మనస్పూర్తిగా అభినందించారు. ” ఈ చిత్ర విజువల్స్ చూస్తుంటే ఒక ప్రేమ కథ చెయ్యాలని ఉంది” అని పూరి అన్నారు. బి.జయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో శాన్వి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బి.ఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్.అర్.మోవీ మేకర్స్ బ్యానర్ సమర్పిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

తాజా వార్తలు