నేడే చార్మీ ప్రేమ ఒక మైకం ఆడియో

A

చార్మింగ్ బ్యూటీ చార్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ప్రేమ ఒక మైకం’ ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్లో జరగనుంది. ఈ సినిమాలో చార్మీ వేశ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకూ ఎన్నో బోల్డ్ గా ఉండే పాత్రలు చేసిన చార్మీ ఈ సినిమా కోసం కొంత మార్చుకున్నాని చెబుతోంది. ‘ ప్రతి సినిమాకి పాత్ర పరంగా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి కానీ నేను ఈ సినిమా కోసం బాగా ఆలోచించాను. ప్రయోగాత్మక పాత్రలు చేసేటప్పుడు పాత్ర కోసం మన పరిమితుల జోన్ ని దాటివచ్చి పాత్రకి న్యాయం చేయాల్సి వస్తుందని నాకు నేను చెప్పుకొని ఈ సినిమా చేసానని’ చార్మీ తెలిపింది. రాహుల్ రైటర్ గా కనిపించనున్న ఈ సినిమాలో శరణ్య సింగర్ గా కనిపించనుంది. ఈ సినిమా మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. గతంలో ’10th క్లాస్’ ‘నోట్ బుక్’ సినిమాలు తీసిన చందు ఈ సినిమాకి డైరెక్టర్. టూరింగ్ టాకీస్ బ్యానర్ పై వెంకట్ సురేష్ – సూర్య శ్రీకాంత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ సంగీతం అందించాడు.

Exit mobile version