కన్నడ “ఆకాశమంత” చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన ప్రకాశ్ రాజ్ తరువాత “ధోని” చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోయినా మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ “దబాంగ్-2” చిత్రంలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్ “దేవుడు చేసిన మనుషులు” చిత్ర షూటింగ్ కోసం బ్యాంకాక్ బయలుదేరారు. దీనితో పాటు మరో చిత్రానికి దర్శకత్వం వహించాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. “బ్యాంకాక్ బయలుదేరాను పూరి రవిలతో చాలా రోజుల తరువాత కలిసి పని చేస్తున్న చాలా ఆనందంగా ఉంది. దీనితో పాటు తరువాత దర్శకత్వం వహించబోయే చిత్రం కోసం కసరత్తు చెయ్యాలి” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీని తరువాత ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు.