త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ మలయాళం లో విజయం సాదించిన “సాల్ట్ అండ్ పెప్పర్ ” చిత్రాన్నిరిమేక్ చెయ్యడానికి అన్ని సిద్దం చేసుకున్నారు. ఈ చిత్రం మాతృక కు ఆశిక్ అబూ దర్శకత్వం వహించారు. లాల్,ఆసిఫ్ అలీ,శ్వేతా మీనన్ మరియు మైథిలి ప్రధాన పాత్రలు పోషించారు. రిమేక్ హక్కులను ప్రకాష్ రాజ్ కొనుకున్నారు ఈ చిత్రాన్ని హిందీ,తెలుగు మరియు తమిళం లో చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ “ధోని” అనే ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి లో విడుదల కానుంది. చూస్తుంటే ప్రకాష్ రాజ్ నటన మరియు దర్శకత్వం ని సమపాళ్ళలో చేయ్యబోతునట్టు కనిపిస్తున్నారు.

Exit mobile version