ప్రభాస్ రెబెల్ ఆగస్ట్ కి వాయిదా

ప్రభాస్ రెబెల్ ఆగస్ట్ కి వాయిదా

Published on May 28, 2012 7:54 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రెబెల్” ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటుంది. నిన్న కొన్ని సన్నివేశాలను గచ్చిబౌలి లో చిత్రీకరించారు అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్ట్ కి వాయిదా పడినట్టు తెలుస్తుంది. గతంలో ఈ చిత్రాన్ని జూలై లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు ఈ ఆలస్యానికి సరయిన కారణం తెలియరాలేదు.. హాట్ భామలు తమన్నా మరియు దీక్ష సెత్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో భారీ పోరాట సన్నివేశాలు భారీ ఎత్తున సెట్ లు కనిపించాబోతున్నాయి. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే.పుల్లా రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా లారెన్స్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు