సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న “పూలరంగడు”

సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న “పూలరంగడు”

Published on Jan 5, 2012 2:01 AM IST

ఈ సంక్రాంతి కి రావాల్సిన అన్ని చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డ్డాయి. ఆ లిస్టు లో పూల రంగడు కూడా చేరిపోయింది గతం లో ఈ చిత్రాన్ని 14 న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు కాని వాయిదా పడింది ఫిబ్రవరి 3 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వీర భద్రం దర్శకత్వం వహిస్తుండగా సునీల్ మరియు ఇషా చావ్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాక్స్ ఇండియా పతాకం పై కే.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 9 న విడుదల చెయ్యబోతున్నారు.ఈ చిత్రం లో సునీల్ సిక్స్ ప్యాక్ బాడి తో కనిపించబోతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి ఏ చిత్రము ప్రకటించిన తేదీలలో విడుదల అయ్యేలా కనిపించటం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు