స్విట్జెర్లాండ్ లో “దిల్ సే” అంటున్న పవన్ కళ్యాణ్

స్విట్జెర్లాండ్ లో “దిల్ సే” అంటున్న పవన్ కళ్యాణ్

Published on May 1, 2012 3:24 AM IST

పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రం లో చివరి పాట చిత్రీకరణ మొదలు పెట్టారు. ఈరోజు మేము చెప్పిన విధంగా పవన్ మరియు శృతి “పిల్లా..” పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు వెంటనే ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా చిత్రంలో చివరి పాట “దిల్ సే” చిత్రీకరణ మొదలుపెట్టారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట కూడా మరో రెండు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ ఆకాశం అమ్మాయి అయితే పాట రీల్ తో చెన్నై బయలుదేరారు. దేవి శ్రీ ప్రసాద్ వద్ద రీ రికార్డింగ్ చేయించుకోడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్ర బృందం ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యదలుచుకోలేదు. హరీష్ శంకర్ దర్శ్హకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్లను బద్దలు కోట్టనుందని చెబుతున్నారు. గణేష్ బాబు భారీ ప్రచారానికి కావలిసిన సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాల కాలం తరువాత పవన్ కళ్యాణ్ చేస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ చిత్రం మే రెండవ వారం లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు