గత కొద్ది వారాలుగా ఎస్ ఎస్ రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు ప్రతీసారి రాజమౌళిని అడుగుతూనే ఉన్నారు పవన్ తో సినిమా ఎప్పుడు అని అయితే రాజమౌళి ఎప్పుడు ఈ విషయం దాటవేస్తునే వచ్చారు. నిన్న రాత్రి జరిగిన పంజా ఆడియో ఫంక్షన్ కి రాజమౌళి గెస్ట్ గా విచ్చేసారు. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ మా కాంబినేషన్లో సినిమా ఎప్పుడు అనేది పవన్ చేతుల్లోనే ఉంది అని అన్నారు. పవన్ మాట్లాడుతూ నాకు ఒక సినిమా చేసి పెట్టమని నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ ని చేయి చాచి అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నాకు ఒక సినిమా చేసి పెట్టమని అన్నారు. ఇన్ని రోజులు వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని ఊహాగానాలు మాత్రమే ఉండేవి భవిషత్తులో అది నిజం కాబోయే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రంలో బిజీగా ఉన్నారు, తరువాత ప్రభాస్ తో భారీ బడ్జెట్లో ఒక చిత్రం రూపొందిస్తారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ – ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- వీడియో : వార్ 2 తెలుగు ట్రైలర్ ( హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్)
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- లోకేష్ కనగరాజ్ కి మాత్రమే ఆ భాగ్యం కల్పించిన రజిని!
- వైరల్: సంధ్య థియేటర్ ‘వీరమల్లు’ స్క్రీనింగ్ వద్ద అకిరానందన్
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!