పాకిస్తాన్ లో బ్యాన్ అయిన “ఏజెంట్ వినోద్”

“పటౌడి నవాబు” సైఫ్ అలీ ఖాన్ నటించిన నూతన చిత్రం “ఏజంట్ వినోద్” మార్చ్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. కాని ఈ చిత్రాన్ని పాకిస్తాన్ లో విడుదల చెయ్యటానికి వారి సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు. ఈ చిత్రం లో పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గురించి ప్రస్తావించడమే కారణంగా తెలుస్తుంది. మాములుగా భారతీయ చిత్రాలు పాకిస్తాన్ లో చాలా బాగా ఆడుతాయి. ఇలా ఒక చిత్రాన్ని నిలిపివేయడం వారి సెన్సార్ బోర్డుకి ఇదే మొదటిసారి కాదు. భారీ బడ్జెట్ తో నిర్మితమయిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ అద్బుతంగా నటించారని బాలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఐరోపాలో చిత్రీకరించబడింది.

Exit mobile version