మార్చ్ 18న ప్రారంభం కానున్న ఎన్టీఆర్ “బాద్షా”

మార్చ్ 18న ప్రారంభం కానున్న ఎన్టీఆర్ “బాద్షా”

Published on Mar 16, 2012 11:27 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం “బాద్షా” మార్చ్ 18న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దూకుడుతో మంచి ఊపు మీద ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాజల్ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ తారలను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా రాబోతున్నట్టు సమాచారం ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోన వెంకట్, గోపి మోహన్ మరియు ఎస్ ఎస్ తమన్ లతో మళ్ళి జట్టు కట్టడం కూడా ఈ అంచనాలు పెరగడానికి కారణం. ఏప్రిల్ చివరి వారం లో కాని మే మొదటి వారం లో కాని మొదలు కాబోతున్న మొదటి షెడ్యూల్ దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరగనుంది.

తాజా వార్తలు