నీకు నాకు డాష్ డాష్ ప్రదర్శన నిలిపివేత!

అవును మీరు విన్నది నిజమే. తేజ డైరెక్షన్లో వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’ ప్రదర్శన నిలిపివేయనున్నారు. ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల్ని రీషూట్ చేసి మళ్లీ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్ర కొత్త వెర్షన్ ను మే 4న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ వార్త థియేటర్ యాజమాన్యం వారికి కూడా తెలియజేసారు. ఈ చిత్రం అటు విమర్శకులని ఇటు ప్రేక్షకులని మెప్పించలేకపోవడంతో దర్శకుడు తేజ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తేజ అద్రుష్టం ఈసారైనా మారుతుందేమో వేచి చూద్దాం. దమ్ము ఈ నెల 27 విడుదలవుతుంది. గబ్బర్ సింగ్ మే రెండవ వారంలో విడుధలవుతుండటం ఈ రెండు భారీ చిత్రాల మధ్య డాష్ డాష్ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూద్దాం.

Exit mobile version