నీకు నాకు డాష్ డాష్ విడుదల తేదీ ఖరారు

నీకు నాకు డాష్ డాష్ విడుదల తేదీ ఖరారు

Published on Mar 23, 2012 2:32 AM IST

తేజ దర్శకత్వంలో కొత్త తారలతో రాబోతున్న ‘నీకు నాకు డాష్ డాష్’ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 12 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన ప్రతి సినిమాలో కొత్త నటీ నటులను పరిచయం చేసే తేజ ఈ సినిమాలో దాదాపు 40 మందికి పైగా కొత్తవారిని పరిచయం చేయబోతున్నాడు. యశ్వంత్ నాగ్ సంగీతమ అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ గారు భవ్య క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు