ఈ నెలలోనే చిత్రీకరణ ముగించుకోనున్న “షిరిడి సాయి”

ఈ నెలలోనే చిత్రీకరణ ముగించుకోనున్న “షిరిడి సాయి”

Published on May 22, 2012 3:28 AM IST

అక్కినేని నాగార్జున భక్తిరస చిత్రం “షిరిడి సాయి” ఈ నెలలో చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. తరువాత ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంటుంది ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో కాని ఆగస్ట్ మొదటి వారంలో కాని విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. కే.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో కే.రాఘవేంద్ర రావు మరియు నాగార్జునల కలయికలో రెండు భక్తి రస చిత్రాలు వచ్చాయి “అన్నమయ్య” మరియు “శ్రీ రామదాసు” ఈ రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు