బాక్స్ ఆఫీస్ మంచి కలెక్షన్లు సాధిస్తున్న నా ఇష్టం

బాక్స్ ఆఫీస్ మంచి కలెక్షన్లు సాధిస్తున్న నా ఇష్టం

Published on Mar 25, 2012 7:11 PM IST

రానా మరియు జెనీలియా జంటగా నటించిన ‘నా ఇష్టం’ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ లభించాయి. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్ర నిర్మాత విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నిర్మాత చెప్పిన దాని ప్రకారం నా ఇష్టం చిత్రం రానా కెరీర్లోనే అత్యధిక మొత్తం. ఈ కలెక్షన్లు ఇలాగే సాగితే నిర్మాతకు లాభాలు తెచ్చే చిత్రంగా మిగులుతుంది. హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు