1986 గోదావరి వరదల నేఫధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం “గుండెల్లో గోదారి”. ఈ చిత్రంలో చాలా రోజుల తరువాత ముమైత్ ఖాన్ ఒక ఐటెం పాటకు నృత్యం చెయ్యబోతున్నారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీమంచు నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే రాజముండ్రి లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్న ముమైత్ చిత్రానికి సంబంధించిన రెండు ఫోటోలను ట్విట్టర్ లో పెట్టారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ లతో తన అభిమానులతో కలిసి ఉండటానికి తన ఉనికిని కాపాడుకునేందుకు తనవంతు కృషి చేస్తూనే ఉంది ఈ భామ. ఆది,లక్ష్మి మంచు,తాప్సి మరియు సుదీప్ కిషన్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుంది.