మార్చ్ 8 న విడుదల కానున్న మిస్టర్ నూకయ్య

మంచు మనోజ్ కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం “మిస్టర్ నూకయ్య” ఎట్టకేలకు మార్చ్ 8న విడుదల కానుంది రెండు సార్లు వాయిదా పడ్డాక ఈ చిత్రం ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసుకుంది సెన్సార్ వారు ఈ చిత్రానికి “ఏ” సర్టిఫికేట్ ఇచ్చారు. అని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ రావు నిర్మించారు . కృతి కర్భంద మరియు సన ఖాన్ లు కథానాయికలుగా కనిపిస్తున్నారు . ఈ చిత్రం లో మనోజ్ 12 విధాలుగా కనిపించబోతున్నారు ఈ చిత్రం కోసం మనోజ్ సాహసోపేతమయిన సన్నివేశాలు చాలా చేశారు ఈ సంవత్సరం లో ఒకానొక మంచి చిత్రం గా ఈ చిత్రం ఉండబోతుందని దర్శకుడు అని తెలిపారు. యువన్ శంకర్ రాజ అందించిన సంగీతం ఇప్పటికే జనం లో కి వెళ్లి విజయం సాదించింది. గతం లో ఈ చిత్రం పేరు మిస్టర్ నోకియ గా ఉండేది తరువాత ఈ చిత్ర పేరుని “మిస్టర్ నూకయ్య” గా మార్చారు.

Exit mobile version