త్వరలో మిస్టర్ నోకియ రీలోడడ్

త్వరలో మిస్టర్ నోకియ రీలోడడ్

Published on Mar 14, 2012 10:42 PM IST

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “మిస్టర్ నూకయ్య’ చిత్రం తిరిగి విడుదల కావటానికి సిద్దమయ్యింది ఈ చిత్రం మాతృకతో పోలిస్తే వేగంగా ఉండబోతుంది దీనికి “మిస్టర్ నూకయ్య రీలోడడ్ ” గా పేరు పెట్టారు. ఈ చిత్రం ఈ నెల 16 కానీ 17 కాని విడుదల అవుతుంది నోకియా పరిశ్రమ తో ఉన్న కొన్ని న్యాయపరమయిన చిక్కుల మూలాన చిత్రం లో చిన్నపాటి మార్పులు చేసి ఉండవచ్చు. “మిస్టర్ నోకియ రీలోడడ్ చిత్రం వేగంగా ఉండబోతుంది అన్ని పత్రికలకు మరియు వెబ్ సైట్ లు ఈ చిత్రానికి మళ్ళి ఒకసారి రివ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ నెల 16 లేక 17 ఈ చిత్రం విడుదల కానుంది శర వేగంగా పనులు జరుగుతున్నాయి” అని మనోజ్ ట్విట్టర్ లో తెలిపారు.అని కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.ఎస్.రావు నిర్మించారు. కృతి ఖర్బంధ మరియు సనా ఖాన్ లు కథానాయికలుగా నటించారు

తాజా వార్తలు