నడిసంధ్రం లో ఆలోచన తుఫాను సృష్టించిన ఏ ఆర్ రెహమాన్ మరియు మణిరత్నం

నడిసంధ్రం లో ఆలోచన తుఫాను సృష్టించిన ఏ ఆర్ రెహమాన్ మరియు మణిరత్నం

Published on Mar 21, 2012 11:27 PM IST

సంగీత చర్చలు కోసం దర్శకులు మరియు సంగీత దర్శకులు పలు ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కొండ ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్ళటం మనకు బాగా తెలిసిన విషయమే. కాని భారతీయ సినిమాలో ఇద్దరు ప్రముఖులు సంగీత మయాజాలికుడు ఏ ఆర్ రెహమాన్ మరియు మణిరత్నం సముద్రం మధ్యలో వారి కలయిక లో వస్తున్న “కడల్” చిత్రంలో ఒక పాట కోసం చర్చలు జరిపారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రం “కడల్” ప్రస్తుతం మనప్పాడ్ దగ్గర తుత్రికోరిన్ అనే గ్రామంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. జాలర్ల గ్రామం లో జరిగే ప్రేమ కథగా ఉండబోతున్న ఈ చిత్రం లో ఒకానొక పాట కోసం వీరివురు సముద్రం మధ్యలో చర్చలు జరిపినట్టు, ఇవాళ పొద్దున్న ఏ ఆర్ రెహమాన్ ట్విట్టర్ లో వీరు ఇరువురు ఉన్న ఒక చిత్రాన్ని పెట్టారు. ఈ చిత్రం లో జాలర్లు ఎదోర్కొనే సమస్యల గురించి కూడా చర్చించబోతున్నారు. గౌతం, సమంత, లక్ష్మి మంచు, అరవింద్ స్వామి మరియు అర్జున్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు