లాస్ ఏంజల్స్ లో త్రుటిలో తప్పించుకున్న విష్ణు

మంచు విష్ణు లోస్ ఏంజల్స్ లో జైలు శిక్ష నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఇండియాకి తిరిగి వస్తున్న సమయంలో విమానాశ్రయంలో ఆసక్తి కరమయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై మంచు విష్ణు ట్విట్టర్ ఇలా చెప్పారు” నేను రెండు కత్తులు కొనుక్కున్నాను దాన్ని నా లగేజ్ తో పాటు విమానాశ్రయానికి తీసుకు వెళ్లాను అక్కడి సిబ్బంది దాన్ని పట్టుకున్నారు వారికి వేల సార్లు క్షమాపణలు చెప్పాను హెచ్చరించి వదిలేశారు లేకుంటే ఈపాటికి జైలు లో ఉండేవాడిని నాకు కత్తులను సేకరించడం అలవాటు అందుకే అవి కొన్నాను చూడటానికి అవి చాలా బాగున్నాయి” అని అన్నారు. విమానాశ్రయ సిబ్బంది హెచ్చరించి వదిలేయడంతో విష్ణు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version