సెన్సార్ విధానాల్లో భారీ మార్పులు

సెన్సార్ విధానాల్లో భారీ మార్పులు

Published on Apr 4, 2012 12:26 AM IST

సెన్సార్ బోర్డు వారు జారి చేసే సర్టిఫికేట్ ల గురించి పరిశ్రమలో పెద్ద చర్చలే జరుగుతూ వచ్చాయి. గత కొంత కాలంగా సెన్సార్ వారు కాస్త ఎక్కువ చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ వారు సర్టిఫికేట్ లు జారి చేసే విషయం లో భారీ మార్పులు జరగనున్నాయి. ఇప్పుడున్న యు,యు/ఏ మరియు ఏ మాత్రమే ఉన్న సెన్సార్ బోర్డు లో కొత్తగా ఏ+,12+ మరియు 15+ వంటి కొత్త సర్టిఫికేట్ లను , హింస ,శృంగారం పాళ్ళు ఎక్కువున్న చిత్రానికి ఏ+, చిత్రం లో హింస మరియు శృంగారం పాళ్ళు లేకపోయినా భాష రెచ్చగొట్టేల ఉంటె ఆ చిత్రానికి 15+ సర్టిఫికేట్ ని ఇస్తారు.ఈ విధానాలు ఇంకా అమలు లోకి రాకపోయినా త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధానాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి మార్పులు తెస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు