సిద్ధార్థ్ మరియు అమలా పాల్ జంటగా నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న చిత్రంగా విడుదలై నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్, నిరవ్ షా, శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ విషయాన్నీ సిద్ధార్థ్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. మేము పెట్టిన పీతుబడులు తిరిగి వస్తుంటే ఆనందంగా ఉందంటూ తెలిపాడు. తెలుగుతో పాటు తమిళ్లో కూడా హిట్ చేసినందుకు థాంక్స్. చుసిన వారు సినిమా బావుంది అంటూ మౌత్ టాక్ ద్వారా సినిమా విజయం సాధించింది.తమన్ అందించిన సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రఫీ, సమీక్షలు కూడా సినిమాకు అనుకూలంగా రావడంతో సినిమా విజయం సాధించింది.