నాని – కృష్ణవంశి సినిమా ప్రారంభం

నాని – కృష్ణవంశి సినిమా ప్రారంభం

Published on Mar 27, 2012 7:23 PM IST

చాలా కాలం గ్యాప్ తరువాత కృష్ణవంశి మళ్లీ డైరెక్షన్ చేయబోతున్నాడు. నాని హీరోగా కృష్ణవంశి ఒక సినిమా ప్రారంభించాడు. ఈ సినిమా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా షూటింగ్ ప్రారంభమై ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. కేరళ హీరొయిన్ కేథరిన్ తెరిస్సా ఈ సినిమాతో తెలుగులో హీరొయిన్ గా పరిచయం కాబోతుంది. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం నాని రాజమౌళి డైరెక్షన్లో ‘ఈగ’ గౌతం మీనన్ డైరెక్షన్లో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు