తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. కీరవాణి గారి అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆయనను టాప్ ప్లేసులో ఉండేలా చేసింది. దానికి ‘మగధీర’ చిత్రమే ఉదాహరణ. ఆయన నేటి చిత్రాల కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి అధునాతమైన సాఫ్ట్ వేర్ వాడతారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రానికి ‘ఘరానా మొగుడు’ కి 4 రోజుల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన కీరవాణి గారు చిరంజీవి గారి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘మగధీర’ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడానికి మాత్రం 40 రోజులు పట్టింది అంటున్నారు. 2012 సంవత్సరం క్యాలెండర్ మొత్తం చాలా సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు కీరవాణి. అందులో కొన్ని రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ‘ఈగ’, జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’, నాగార్జున నటిస్తున్న ‘షిర్డీ సాయి బాబా’, మరియు క్రిష్ డైరెక్షన్లో వస్తున్న కృష్ణం వందే జగద్గురుం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?