సుకుమార్ దర్శకత్వం లో మహేష్ బాబు చేస్తున్న చిత్రంలో కాజల్ కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్నారు ముందు ఈ పాత్రలో తమన్నాని అనుకున్నారు కాని తమన్నా డేట్స్ విషయంలో తేడా రావడంతో మరొక కథానాయిక కోసం వెతికారు. ఈ జంట గతంలో “బిజినెస్ మాన్” చిత్రం లో కనిపించారు ఆ చిత్రం ఎంతటి విజయం సాదించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం కూడా అంతటి విజయం సాదిస్తుందని అనిపిస్తుంది.