లండన్ లో జగపతి బాబు తాండవం

లండన్ లో జగపతి బాబు తాండవం

Published on May 9, 2012 9:12 PM IST

ఏ ఎల్ విజయ్ రాబోతున్న ద్విభాషా చిత్రం “తాండవం” చిత్రం లో జగపతి బాబు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రంలో విక్రం,అనుష్క మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. గత మోడు వారాలుగా లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిర్మితం అవుతున్న విధానం పై చిత్ర బృందం ఆనందంగా ఉన్నారు. యుటివి మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ధనంజయ్ గోవింద్, యుటివి అధినేత ట్వీట్ చేశారు. ” చలతి వాతావరణం మరియు వర్షాల మధ్య ఇరవై ఒక రోజుల తాండవం చిత్రీకరణ పూర్తయ్యింది దర్శకుడు విజయ్, విక్రమ్ జగపతి బాబు మరియు ఇతరులు చాల బాగా పని చేశారు” జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాండవం చిత్రీకరణ మొత్తం ఈ వేసవిలోనే పూర్తవనుంది. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు