“బర్ఫీ” చిత్ర బృందం చేత కన్నీరు పెట్టించిన ఇలియానా

“బర్ఫీ” చిత్ర బృందం చేత కన్నీరు పెట్టించిన ఇలియానా

Published on Jan 6, 2012 8:28 PM IST

ఇలియానా డీక్రుజ్ “బర్ఫీ ” అనే చిత్రం ద్వారా బాలివుడ్ లో ప్రవేశించబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో రన్బీర్ కపూర్ సరసన ఇలియానా నటిస్తుంది.ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా బధిర పాత్రలో కనపడబోతున్నారు. ఈ మధ్యనే జరిగిన చిత్రీకరణ లో ఇలియానా నటన చిత్ర బృందం చేత కంట తడి పెట్టించింది అంటున్నారు. చూస్తుంటే ఈ చిత్రం లో ఇలియానా పాత్ర అనువాదకురాలిగా కనిపించబోతున్నారు. అందాల తారగా తెలుగు తమిళం లో ప్రాచుర్యం పొందిన ఈ నాయిక ఇప్పుడు హిందీ లో ఇలాంటి పాత్రతో ప్రవేశిస్తున్నారు ఈ చిత్రం కాకుండా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల చిత్రం లో కూడా ఇలియానా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు