ఖరారైన ఇద్దరమ్మాయిలతో ఆడియో రిలీజ్ డేట్

Iddarammayilatho-Audio-Launch

ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం ఏప్రిల్ 21న ఘనంగా జరగనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ కి రీ రికార్డింగ్ మొదలు పెట్టాడు. ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ లో ఇచ్చిన ఒక ట్యూన్ ప్రస్తుతం చాలా మంది యువకుల ఫోన్ రింగ్ టోన్ గా మారింది. ఈ సినిమాలో మ్యూజిక్, అన్ని పాటలు ఇంతకముందు తను చేసిన వాటికన్నా బాగుంటాయని దేవీ శ్రీ ప్రసాద్ ప్రామిస్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. సమ్మర్లో రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన ఈ సినిమాని మే 10న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version