చిరంజీవి తో నటించాలి అని ఉంది – ఆమని

చిరంజీవి తో నటించాలి అని ఉంది – ఆమని

Published on Dec 10, 2011 5:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి తో నటించాలి అని ఉంది అని సీనియర్ నటి ఆమని తన మనసులోని మాట చెప్పారు. ఒకప్పుడు మంచి పేరున్న హీరోయిన్ గా వెలుగొంది ఈమె, ప్రస్తుతం ‘దేవస్థానం’ అనే చిత్రం తో తిరిగి రంగ ప్రవేశం చేస్తున్నారు. చిరంజీవి తో నటించే అవకాశం గతం లో తనకి వచ్చినా, కొన్ని కారణాల వలన కుదరలేదు అని, ఇప్పుడు అవకాశం ఒస్తే తప్పకుండా నటించాలని ఉంది అని చెప్పారు.

తెలుగు లో మీకు ఇష్టం అయిన హీరోఇన్లు ఎవరు అని అడగగా, ప్రియమణి, అనుష్క మరియు నయన తార పేర్లను చెప్పారు. “అనుష్క నటన అరుంధతి సినిమా లో చాలా బాగుంది. అలాగే శ్రీ రామ రాజ్యం చిత్రం లో నయన తార నటన కూడా చాలా బాగుంది”, అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు