గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్య సెట్లో బాగా ఎంజాయ్ చేస్తుందంట. ఏ విషయంలో అంటారా? గతంలో సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు నా షాట్ పూర్తవగానే నా పని నేను చూసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. కాని ఈ మధ్య కాలంలో షూటింగ్లో అందరితో మాట్లాడుతూ కలిసిపోతున్నాను. ఈ మధ్య పాల్గొన్న జులాయి, దేవుడు చేసిన మనుషులు షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేశాను. సెట్లో అందరు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాం. షూటింగ్ అయిపోగానే కుటుంబ సభ్యుల నుండి విదిపోతున్నననే భాధ కలుగుతుంది అంటుంది. అల్లు అర్జున్ తో కలిసి ఇలియానా నటించిన జులాయి షూటింగ్ పూర్తి చేసుకుని జూలై 13న విడుదల కావాల్సి ఉండగా మరో వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె రవితేజ సరసన నటించిన మరో సినిమా దేవుడు చేసిన మనుషులు కూడా ఆగుస్టులో విడుదలకు సిద్ధమవుతుంది.