‘నా ఇష్టం’ పై ఆశలు పెట్టుకున్న యువ హీరో

‘నా ఇష్టం’ పై ఆశలు పెట్టుకున్న యువ హీరో

Published on Mar 18, 2012 7:28 PM IST

శ్రీహరి నాను డైరెక్షన్లో వచ్చిన ‘తకిట తకిట’ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన హర్షవర్ధన్ రాణే మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ రానా మరియు జెనీలియా జంటగా నటిస్తున్న ‘నా ఇష్టం’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ తన అద్రుష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ చిత్ర విజయం పై తన భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్ర సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెల 23 న విడుదలకు సిద్ధమవుతుంది. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. నా ఇష్టం ప్లాటినం డిస్క్ వేడుకను త్వరలో హైదరాబాదులో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు